ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ షాక్.. మరో అవినీతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు

CBI Lodges FIR Against Former Delhi Deputy CM Manish Sisodia in Snooping Case,CBI Lodges FIR Against Manish Sisodia,Delhi Deputy CM Manish Sisodia,Manish Sisodia in Snooping Case,Mango News,Mango News Telugu,FIR against Sisodia in Snooping Case,CBI Registers FIR against Manish Sisodia,Fresh Trouble For Manish Sisodia,Deputy CM Manish Sisodia Latest News,Manish Sisodia News Today,Manish Sisodia Snooping Case News,Delhi Liquor Policy,Delhi Liquor Scam,Delhi Snooping Case Latest Updates

ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యనేత, ఆ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో అవినీతి కేసుకి సంబంధించి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఫీడ్‌బ్యాక్ యూనిట్ (ఎఫ్‌బియు)కి సంబంధించిన స్నూపింగ్ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద మనీష్ సిసోడియా సహా ఏడుగురిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కాగా ఈ కేసులో సిసోడియాపై సీబీఐకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రాసిక్యూషన్ మంజూరు చేసింది. అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 17 ప్రకారం సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి లభించిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపిన కమ్యూనికేషన్‌లో హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఈ పరిణామంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, సిసోడియాను ఎక్కువ కాలం జైల్లో ఉంచాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్దేశమని ఆరోపించారు.

కాగా 2015లో ఎఫ్‌బీయుని ఏర్పాటు చేయాలని ఆప్ సర్కార్ ప్రతిపాదించింది. దీని ప్రకారం.. వివిధ విభాగాలు మరియు స్వయంప్రతిపత్త సంస్థలు మరియు సంస్థల పనితీరుకు సంబంధించి సంబంధిత సమాచారం మరియు చర్య తీసుకోదగిన అభిప్రాయాన్ని సేకరించడానికి జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ ప్రభుత్వం అధికార పరిధిలోకి వస్తుంది. అయితే ఈ సీక్రెట్ సర్వీస్ ఖర్చుల కోసం రూ. 1 కోటి కేటాయించడంతో యూనిట్ 2016లో పని చేయడం ప్రారంభించిందని సీబీఐ పేర్కొంది. 2015లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని, అయితే ఎజెండా నోట్ ఏదీ సర్క్యులేట్ కాలేదని సీబీఐ ఆరోపించింది. అలాగే ఎఫ్‌బీయులో నియామకాల కోసం లెఫ్టినెంట్ గవర్నర్ నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదని కూడా పేర్కొంది. అయితే ఈ మొత్తం వ్యవహారం చట్టవ్యతిరేకంగా ఉందని, ఇందులో సిసోడియా కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here