14 రాష్ట్రాలకు రూ.6,195.08 కోట్లు విడుదల చేసిన కేంద్రం, ఏపీకి రూ.491.41 కోట్లు

Andhra Pradesh, Centre releases grant worth Rs 6195 crore to 14 states, Finance Ministry, Finance Ministry Releases Rs 6195 Crore Grant to 14 states, Government releases Rs 6195 crore grant to 14 states, national news, post devolution revenue deficit, post devolution revenue deficit grant, post devolution revenue deficit grant to 14 states, Union government releases Rs 6195 crore

కేంద్ర ఆర్థిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు తాజాగా రూ.6,195.08 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఆరో విడతగా 14 రాష్ట్రాలకు 6,195.08 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్రాలకు ఈ నిధులు అదనపు వనరులగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, తమిళనాడు, త్రిపుర, సిక్కిం, ఉత్తరాఖండ్‌ ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా విడుదలైన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వివరాలు:

  • ఆంధ్రప్రదేశ్‌ – రూ.491.41 కోట్లు
  • అసోం – రూ.631.58 కోట్లు
  • హిమాచల్‌ ప్రదేశ్‌ – రూ.952.58 కోట్లు
  • కేరళ – రూ.1276.91 కోట్లు
  • మణిపూర్‌ – రూ.235.33 కోట్లు
  • మేఘాలయ – రూ.40.91 కోట్లు
  • మిజోరాం – రూ.118.50 కోట్లు
  • నాగాలాండ్‌ – రూ.326.41 కోట్లు
  • పంజాబ్‌ – రూ.638.25 కోట్లు
  • పశ్చిమబెంగాల్‌ – రూ.417.75 కోట్లు
  • సిక్కిం – రూ.33.77 కోట్లు
  • తమిళనాడు – రూ.335.42 కోట్లు
  • త్రిపుర – రూ.269.66 కోట్లు
  • ఉత్తరాఖండ్ -‌ రూ.417.75 కోట్లు

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + sixteen =