ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన మొట్ట మొదటి ఔట్‌లెట్ (రిటైల్ స్టోర్)ను ఓపెన్ చేసింది. మంగళవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను సంస్థ సీఈఓ టిమ్ కుక్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా ఆయన స్టోర్ డోర్స్ ఓపెన్ చేసి కస్టమర్లను ఆహ్వానించడం విశేషం. అంతకుముందు బీకేసీలోని ఉద్యోగులతో కలిసి ఆయన సెల్ఫీలు దిగారు. దీనికోసం టిమ్ కుక్ సోమవారం ఇండియాకు చేరుకున్నారు. మరోవైపు కొనుగోలు కోసం వినియోగదారులు ఉదయం నుంచే ఎండను సైతం లెక్క చేయక క్యూ లైన్లలో నిలబడి వేచి చూస్తుండటం గమనార్హం. కాగా ఈ రిటైల్ స్టోర్‌ను ‘యాపిల్ బీకేసీ’గా వ్యవహరిస్తుండగా.. ఢిల్లీలో ప్రారంభించనున్న దానిని ‘యాపిల్ సాకెట్’ స్టోర్‌గా సంభోదిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఏప్రిల్ 20న ఢిల్లీలో రెండవ స్టోర్‌ను ఓపెన్ చేస్తున్నట్లు ఇప్పటికే యాపిల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ముంబైలోని యాపిల్ బీకేసీ రీటైల్ స్టోర్ 22,000 చదరపు విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. లాస్‌ఎంజెల్స్, న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్‌పూర్ వంటి నగరాల తర్వాత ముంబైలోనే యాపిల్ ఐ-ఫోన్ రిటైల్ స్టోర్ ఏర్పాటు కానుండటం గమనార్హం. అలాగే ముంబైలో ప్రారంభించే యాపిల్ స్టోర్ మాదిరిగానే ఢిల్లీ రిటైల్ స్టోర్ సైతం దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఇక యాపిల్ బీకేసీ లోగోను ముంబై ఐకానిక్ ఆర్ట్ అయిన ‘కాలీపీలి టాక్సీ ఆర్ట్’తో రూపొందించగా.. ఢిల్లీ సాకేత్ లోగోను ఆ రాష్ట్ర సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. కాగా ఢిల్లీ సాకెట్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్ రిటైల్ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇండియాలో వ్యాపార విస్తరణలో భాగంగా.. ఇప్పటికే చైనాలో ఉన్న తయారీ యూనిట్‌ను భారత్‌కు తరలిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE