శ్రీలంకతో జరిగే టెస్ట్, టీ20 సిరీస్ లకు భారత్ జట్లు ఇవే…

BCCI Announced India Squads for T20, Test Series Against Sri Lanka

త్వరలో స్వదేశంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య 3 టీ20ల సిరీస్, 2 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. లక్నో, ధర్మశాలల్లో ఫిబ్రవరి 24, 26, 27 తేదీల్లో టీ20 లు, మొహాలీలో మార్చి 4-8 వరకు తొలిటెస్ట్, బెంగళూరులో మార్చి 12-16 వరకు రెండో టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీ20లు, టెస్టుల్లో శ్రీలంకతో తలపడే భారత్ జట్లను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది.

టెస్ట్, టీ20 సిరీస్ లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించనున్నాడు. కాగా టెస్ట్ జట్టులో అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలకు చోటు దక్కలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు అనంతరం జాతీయ జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్, ప్రియాంక్ పంచాల్, కేఎస్ భరత్ కూడా ఎంపికయ్యారు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ శ్రీలంకతో సిరీస్ కు దూరమయ్యాడు.

భారత్ టెస్ట్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రియాంక్ పంచాల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ.

భారత్ టీ20 జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, చాహల్, ఆర్ బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ . సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ