అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ

International News Updates, Mango News Telugu, Narendra Modi meets US President, Narendra Modi meets US President Donald Trump, national political updates, PM Narendra Modi meets US President, PM Narendra Modi meets US President Donald Trump, Prime Minister Narendra Modi, Prime Minister Narendra Modi meets US President, Prime Minister Narendra Modi meets US President Donald Trump, US President Donald Trump

జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఫ్రాన్స్ లోని బియారిట్జ్ లో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ కశ్మీర్ అంశంపై సదస్సులో చర్చ జరిగిందని చెప్పారు. భారత్ మరియు పాకిస్తాన్ అమెరికాకు మిత్ర దేశాలని, కశ్మీర్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నట్టు మోడీ వివరించారని చెప్పారు. ఎప్పటినుంచో కశ్మీర్ అంశం భారత్-పాకిస్తాన్ కు సంబంధించిన ద్వైపాక్షిక విషయమని, రెండు దేశాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటారని ఖచ్చితంగా నమ్ముతున్నానని అన్నారు.

కశ్మీర్ పై అడిగిన ప్రశ్నకు ప్రధాని మోడీ స్పందిస్తూ, భారత్‌ మరియు పాకిస్థాన్‌ల మధ్య ఉన్న సమస్యలన్నీ ద్వైపాక్షిక స్వభావం కలిగిఉన్నవే అని, అందువలన మరో దేశాన్ని ఇబ్బంది పెట్టకుండా సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించుకోగల నమ్మకం ఉందని చెప్పారు. జీ-7 దేశాల సదస్సులో ప్రపంచ శాంతితో సహా అనేక అంశాలపై చర్చ జరిగిందని చెప్పారు. భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. భవిష్యత్ లో కూడ అనేక అంశాలపై భారత్, అమెరికా కలిసి పని చేస్తాయని చెప్పారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here