హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన సౌరవ్ గంగూలీ, సోదరుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

BCCI President Sourav Ganguly, BCCI President Sourav Ganguly in home quarantine, Snehashish Ganguly tests positive for Covid-19, Sourav Ganguly Brother Snehasish Tests Corona Positive, Sourav Ganguly brother Snehasish tests positive, Sourav Ganguly Coronavirus, Sourav Ganguly in Home Quarantine

బీసీసీఐ ప్రెసిడెంట్, భారతజట్టు మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ హోమ్‌ క్వారెంటైన్‌లోకి వెళ్లినట్టుగా తెలుస్తుంది. గంగూలీ సోదరుడు, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (కాబ్) జాయింట్‌ సెక్రటరీ స్నేహశీష్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని గంగూలీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరోవైపు కొద్ది రోజుల క్రితమే స్నేహశీష్‌ భార్య, ఆమె తల్లి దండ్రులు సైతం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu