కోటి మొక్కలతో “వన మహోత్సవం”, జూలై 22 న ప్రారంభించనున్న సీఎం జగన్

Andhra government, Andhra Pradesh, Andhra Pradesh Latest News, AP CM YS Jagan, AP CM YS Jagan Will Start Vana Mahotsavam Programme, AP News, Van Mahotsav, Vana Mahotsavam Programme, Vanamahotsava, Vanamahotsava Programme In AP, YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూలై 22 వ తేదీన తాడేపల్లిలో మొక్కలు నాటి “వన మహోత్సవం” కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో కోటి మొక్కలు నాటాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 12721 కిలోమీటర్ల పొడవునా రోడ్లకు ఇరువైపులా 70 లక్షల మొక్కలు, అలాగే ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లే అవుట్ వద్ద 30 లక్షల మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు. జూలై 20 వ తేదీలోగా వన మహోత్సవ కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలనీ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + nine =