వైద్య ఖర్చులు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి, నేటి నుంచి మరో 6 జిల్లాల్లో అమలు

Aarogyasri Expansion Services In AP, Aarogyasri Scheme, Aarogyasri Scheme News, Andhra Pradesh, AP Aarogyasri Expansion Services, AP CM YS Jagan, AP CM YS Jagan Launches Aarogyasri Expansion, AP News, YSR Aarogyasri Scheme

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గత జనవరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టు’ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య శ్రీ విస్తరణ సేవల్లో భాగంగా వైద్యం ఖర్చు రూ.1000 దాటిన దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయించారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకంలో గతంలో 1,059 వ్యాధులకు చికిత్స అందిస్తుండగా, ఆ సంఖ్యను పెంచి 2,200 వ్యాధులకు వర్తించే విధంగా మార్పులు చేశారు. ఈ క్రమంలో జూలై 16, గురువారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాతో సహా మరో ఆరు జిల్లాలలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకం పరిధిని మరింత విస్తృతంగా పెంచుతున్నామని చెప్పారు. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి, నెలకు రూ.40వేలు సంపాదించే వ్యక్తికి కూడా ఆరోగ్య శ్రీ వర్తింపు చేస్తామని తెలిపారు. అలాగే ఆస్పత్రులకు గ్రేడింగ్‌ విధానం అమలు చేస్తామని అన్నారు. దేశంలో కరోనా వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. రాష్ట్రంలో మొత్తం కోటి 42 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసినట్టు చెప్పారు.

జూలై 15 నుంచి ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలు ప్రారంభమయ్యే జిల్లాలు:

  • విజయనగరం
  • విశాఖపట్నం
  • గుంటూరు
  • ప్రకాశం
  • వైఎస్ఆర్ (కడప)
  • కర్నూలు

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =