హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కోవిడ్ వ్యాక్సిన్ ను దేశంలో ఇప్పటికే పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలను తాజాగా వెల్లడించారు. కోవిడ్ పై కొవాగ్జిన్ వ్యాక్సిన్ 77.8 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. అలాగే డెల్టా వేరియంట్ (B.1.617.2) కు వ్యతిరేకంగా 65.2 శాతం ప్రభావం చూపుతుందని తెలిపారు. తీవ్రమైన కోవిడ్ లక్షణాలపై 93.4 శాతం ప్రభావవంతంగా, ఇక అసింప్టోమాటిక్ కోవిడ్-19 కు వ్యతిరేకంగా 63.6 శాతం సమర్థత చూపిస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 25 సైట్లలో18-98 సంవత్సరాల 25,800 మంది వాలంటీర్లపై ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబడ్డాయని, దేశంలో ఏ వ్యాక్సిన్ కైనా ఇప్పటిదాకా నిర్వహించిన పేజ్-3 సమర్థత ట్రయల్స్ లో ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ