కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు శుభవార్త అందించారు. పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త స్లాబ్‌ల ప్రకారం, రూ.12 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదు, అంటే ఇది మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరటగా మారనుంది.
కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లు:
రూ. 0-4 లక్షలు – నిల్ (పన్ను లేదు)
రూ. 4-8 లక్షలు – 5%
రూ. 8-12 లక్షలు – 10%
రూ. 12-16 లక్షలు – 15%
రూ. 16-20 లక్షలు – 20%
రూ. 20-24 లక్షలు – 25%
రూ. 24 లక్షల పైగా – 30%
పన్ను చెల్లింపుదారులకు ఎంత లాభం?
రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు, అంటే రూ.12.75 లక్షల వరకు స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి పన్ను చెల్లించనవసరం లేదు.
రూ.18 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి సుమారు రూ.70,000 మిగిలే అవకాశం.
రూ.25 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి సుమారు రూ.1.10 లక్షలు మిగిలే అవకాశం.
ముఖ్యమైన మార్పులు:
TDS, TCS రేట్ల తగ్గింపు: పన్ను కట్టే విధానాన్ని సరళీకరించనున్నారు.
గృహ రుణ వడ్డీపై రూ.1.5 లక్షల మినహాయింపు కొనసాగనుంది.
సీనియర్ సిటిజన్లకు పెద్ద ఊరట: వడ్డీ ఆదాయంపై TDS పరిమితి రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంపు.
అద్దె ఆదాయంపై TDS రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంపు.
ఐటీ రివైజ్డ్ రిటర్న్స్ సమర్పణకు గడువు 2 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెంపు.
ఉన్నత విద్య రుణాలపై TCS మినహాయింపు.
ఈ మార్పులతో మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. భారతీయ న్యాయ సంహిత తరహాలో IT చట్టాన్ని తీర్చిదిద్దనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పన్ను చెల్లింపుదారులకు మరింత అనుకూలంగా మారబోయే కొత్త పన్ను విధానం ఎలా ఉండబోతుందో చూడాలి!
#UnionBudget2025 | Finance Minister Nirmala Sitharaman says, " I am now happy to announce that there will be no income tax up to an income of Rs 12 lakhs." pic.twitter.com/rDUEulG3b9
— ANI (@ANI) February 1, 2025