పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, 24 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం?

Parliament Monsoon Session Begins Likely to Introduce 24 Bills, Parliament Monsoon Session Likely to Introduce 24 Bills, Parliament Monsoon Session Begins, Parliament Monsoon Session Starts Toady, Parliament Monsoon Session, Centre is all set to introduce 24 Bills during the Monsoon Session of Parliament, Monsoon Session of Parliament, Centre is all set to introduce 24 Bills, Cantonment Bill, the Multi-State Cooperative Societies Bill, Amendment Bill, Monsoon Session, Parliament, Parliament Monsoon Session News, Parliament Monsoon Session Latest News, Parliament Monsoon Session Latest Updates, Parliament Monsoon Session Live Updates, Mango News, Mango News Telugu,

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేడు (జూలై 18, సోమవారం) ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో ఈ సమావేశాలు మొత్తం 18 రోజుల పాటుగా ఆగస్టు 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. వర్షాకాల సమావేశాల ప్రారంభమైన అనంతరం జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. సమావేశాల తొలి రోజునే రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుండడంతో ఓటింగ్ నిమిత్తం మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్ సభను వాయిదావేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడుతూ, “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్నందున ఈ కాలం చాలా ముఖ్యమైనది. 25 సంవత్సరాల తర్వాత దేశం స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకునేప్పుడు, వచ్చే 25 సంవత్సరాల ప్రయాణం ఎలా ఉండాలనే దానిపై మనం ప్లాన్ చేసుకోవాలి. ఎంత వేగంగా ముందుకు సాగవచ్చు మరియు కొత్త ఎత్తులను ఎలా చేరుకోవచ్చు? వంటి తీర్మానాలు చేయడం, ఆ తీర్మానాలకు అంకితం చేయడం ద్వారా జాతికి దిశానిర్దేశం చేయడం చేయాలి. సభ దేశానికి నాయకత్వం వహించాలి. సభలోని సభ్యులందరూ దేశానికి కొత్త శక్తిని నింపడంలో కీలక పాత్ర పోషించాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున ఈ సెషన్ చాలా కీలకం. ఇవాళ కూడా ఓటింగ్ జరుగుతోంది. మరియు ఈ సెషన్ లోనే కొత్త రాష్ట్రపతి మరియు కొత్త ఉపరాష్ట్రపతి పదవీకాలం కూడా ప్రారంభమవుతుంది. లోతైన ఆలోచన, వివరణాత్మక చర్చతో సభను సాధ్యమైనంత ఎక్కువ ఉత్పాదకత మరియు ఫలవంతమైనదిగా చేయాలని ఎంపీలందరినీ కోరుతున్నాను. అందుకే అందరూ సహకరించాలి, అందరి కృషి ద్వారానే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుంది” ప్రధాని మోదీ పేర్కొన్నారు.

నేడు పార్లమెంట్ లో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుండగా, ఓట్ల లెక్కింపు జూలై 21న చేపట్టనున్నారు. జూలై 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న నిర్వహించనుండగా, ఆగస్టు 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు 2022 శీతాకాల సమావేశాలు పార్లమెంట్ కొత్త భవనంలో జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన నేపథ్యంలో ఈ వర్షాకాల సమావేశాలే ప్రస్తుత పార్లమెంట్ భవనంలో చివరి సెషన్ అయ్యే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 6 =