బీహార్ అసెంబ్లీ రిజల్ట్స్: ఆధిక్యంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి

Bihar Assembly Elections-2020 Results LIVE Updates

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి 125 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండగా, మహాగట్‌బంధన్ 101 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: (ఆధిక్యం)

  • బీజేపీ: 70
  • జేడీయూ: 53
  • ఆర్జేడీ: 60
  • కాంగ్రెస్: 20
  • వామపక్షాలు: 19
  • ఎల్జేపీ: 4
  • ఇతరులు: 8
  • వీఐపీ: 6
  • హెఛ్ఏఎం: 1

ముందుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 33 జిల్లాలో 55 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫలితాల్లో ఎన్డీఏ(బీజేపీ-జనతాదళ్ యునైటెడ్), మహాగట్‌బంధన్‌ (కాంగ్రెస్, ఆర్జేడీ,వామపక్షాలు కూటమి) మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. కాగా ఎల్జేపీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోతుంది. ఎన్డీఏ నుంచి సీఎం అభ్యర్థి నితీష్ కుమార్, మహాగట్‌బంధన్‌ నుంచి సీఎం అభ్యర్థిగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ అధినేత తేజస్వి ప్రసాద్ యాదవ్ బరిలో ఉన్నారు. బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎక్కువ శాతం మహాగట్‌బంధన్ వైపే మొగ్గు చూపినప్పటికీ, ప్రస్తుతం ఎన్డీఏ బలమైన పోటీ ఇస్తుంది. బీహార్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు 122 అసెంబ్లీ ఆస్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ