అమర జవాన్ మహేష్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం, ఇంటి స్థలం: సీఎం కేసీఆర్

CM KCR Aa 50 Lakhs for Martyred Jawan Ryada Mahesh Family, 50 Lakhs for Martyred Ryada Mahesh Family, KCR Announces Rs 50 Lakhs for Martyred Jawan Ryada Mahesh, Martyred Army jawan from Telangana, Martyred Jawan, Martyred Jawan Ryada Mahesh, Martyred Jawan Ryada Mahesh Family, Ryada Mahesh, Telangana CM, Telangana CM KCRnnounces Rs 50 Lakhs for Martyred Jawan Ryada Mahesh Family

జమ్మూ కశ్మీర్‌ లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టారు లైన్ అఫ్ కంట్రోల్ వద్ద జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన జవాన్ ర్యాడా మహేష్‌‌ వీరమరణం పొందారు. సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో జవాన్ మహేశ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని సీఎం కొనియాడారు. మహేశ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, అమర జవాన్ మహేష్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here