గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2022: నేడు రెండో విడత పోలింగ్, అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ప్రధాని మోదీ

Gujarat Assembly Elections 2022 PM Modi Cast His Vote In Ahmedabad During Second Phase Today, PM Modi Cast His Vote In Ahmedabad During Second Phase Today, Gujarat Assembly Elections Second Phase, 2022 Gujarat Assembly Elections, Gujarat Assembly Elections, Gujarat Assembly Elections 2022, PM Modi Cast His Vote, Gujarat polls second phase, Prime Minister Narendra Modi, Gujarat Assembly Elections News, Gujarat Assembly Elections Latest News, Gujarat Assembly Elections Live Updates, Mango News, Mango News Telugu

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రెండో మరియు చివరి దశ ఓటింగ్ సోమవారం ప్రారంభమైంది. అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ సహా మొత్తం 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో సహా 61 రాజకీయ పార్టీల నుండి మొత్తం 833 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో 14,975 పోలింగ్ స్టేషన్‌లలో ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభవగా.. మొదటి గంట వ్యవధిలో సగటున 4.75 శాతం ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 2.5 కోట్ల మంది ఓటర్లు, బరిలో నిలిచిన 833 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. ముఖ్యంగా ప్రధాన పోరు అధికార బీజేపీ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య నెలకొనగా.. మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంటర్ అవడంతో త్రిముఖ పోటీగా మారింది.

ఈ నేపథ్యంలో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు వేశారు. అహ్మదాబాద్ నగరంలోని రణిప్ ప్రాంతంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో ప్రధాని మోదీ ఓటు వేశారు. కేంద్ర హోం మంత్రి, బీజేపీ ఎంపీ అమిత్ షా నగరంలోని నారన్‌పురా ప్రాంతంలోని మున్సిపల్ సబ్ జోనల్ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు ఓటు వేసిన రాజకీయ ప్రముఖుల్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఉన్నారు. ఇక గుజరాత్ ఎన్నికల రెండవ దశ ఎన్నికలలో పోటీలో ఉన్న అనేక మంది ప్రముఖ అభ్యర్థులలో ముగ్గురు ప్రముఖులు.. హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకోర్ మరియు జిగ్నేష్ మేవానీ ప్రత్యేకాకర్షణగా నిలిచారు. 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కథనాన్ని రూపొందించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా వారు తమ పార్టీల “స్టార్ అభ్యర్థులు”గా పరిగణించబడుతున్నారు. కాగా గుజరాత్‌లో మొదటి దశ పోలింగ్ ఈ నెల 1న జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 8వ తేదీన గుజరాత్ సహా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + thirteen =