బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘సమాధాన్ యాత్ర’ను ప్రారంభించారు. గురువారం పశ్చిమ చంపారన్ జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో ఆయన ప్రజలతో మమేకమవనున్నారు. తద్వారా ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటివాటిపై ప్రజలనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అలాగే ప్రభుత్వ అధికారుల పనితీరుపై కూడా ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు. అయితే పాదయాత్ర ప్రారంభం సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది బీహార్ శాసనసభ బడ్జెట్ సెషన్ అనంతరం దేశవ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇది రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ యాత్ర ద్వారా కాగా 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకై నితీశ్ ప్రయత్నించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సీఎం నితీశ్ కుమార్ ఇలా పాదయాత్రలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో న్యాయ యాత్ర, వికాస్ యాత్ర, ప్రవాస్ యాత్ర, విశ్వాస్ యాత్ర, సేవా యాత్ర, సమీక్ష యాత్ర, జల్ జీవన్ హరియాలి యాత్ర వంటి చాలా యాత్రలు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE