బర్డ్ ఫ్లూ: దేశంలో ఇప్పటికి 9 రాష్ట్రాల్లో నిర్ధారణ

Bird Flu Status: So far 9 States Affected in the Country

దేశంలో పలు రాష్ట్రాలకు బర్డ్‌ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) వ్యాధి పాకుతుంది. ఆదివారం వరకు కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా, తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీలలో కూడా నిర్ధారణ అయింది, దీంతో బర్డ్ ఫ్లూ వ్యాధి మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు చేరినట్టయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని వైరస్‌ ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర పశుసంవర్దక శాఖ పలు సూచనలు చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఈ వైరస్‌కు సంబంధించి పుకార్లు వ్యాప్తి చెందకుండా చూడాలని కేంద్రం సూచించింది. అలాగే ప్రభావిత రాష్ట్రాలైన కేరళ, హిమాచల్‌ప్రదేశ్ లలో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ