మాజీ కేంద్రమంత్రి జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూత

BJP Leader and Former Union Minister Jaswant Singh, BJP Leader and Former Union Minister Jaswant Singh Passes Away, Ex-Union Minister Jaswant Singh Dies, Former Union Minister Jaswant Singh, Former Union Minister Jaswant Singh Dies, Former Union Minister Jaswant Singh Passes Away, Jaswant Singh, Jaswant Singh Death News

మాజీ కేంద్ర మంత్రి‌ జశ్వంత్‌ సింగ్ (82)‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జశ్వంత్‌ సింగ్ కు తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన జనవరి 3, 1938 లో రాజస్థాన్‌లోని జసోల్‌లో జన్మించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యవస్థాపక సభ్యుల్లో జశ్వంత్‌ సింగ్‌ ఒకరు. పార్లమెంటు సభ్యుడిగా ఎక్కువ కాలం పనిచేసిన నేతగా ఆయన ఎంతో గుర్తింపు పొందారు. ఐదుసార్లు రాజ్యసభకు, నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు వంటి పలు కీలక శాఖలకు మంత్రిగా జశ్వంత్‌ సింగ్ బాధ్యతలు నిర్వహించారు. జశ్వంత్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు, పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu