కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భట్టి

ktr kcr batti vikramarka telangana politics congress brs,ktr kcr batti vikramarka,telangana politics congress brs,Mango News,Mango News Telugu,KCR, batti vikramarka, BRS, Congress, KTR, Telangana Politics,batti vikramarka Latest News,batti vikramarka Latest Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News

ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్తూనే.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శల బాణాలు వదులుతున్నారు. అనారోగ్యంతో కేసీఆర్ బయటకు రాకపోయినప్పటికీ.. కేటీఆర్ పార్టీ బరువు, బాధ్యతలను మోస్తూ ముందుకు కదులుతున్నారు. అయితే ఇటీవల నిర్వహించిన ప్రతి సభలోనూ కేటీఆర్.. సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన గొప్పతనం గురించి వివరిస్తూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పలుమార్లు కేసీఆర్‌ను పులిగా కూడా అభివర్ణించారు. పులి బయటకొస్తే రాజకీయ ప్రత్యర్థులు పరార్ అన్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

అయితే కేటీఆర్.. కేసీఆర్‌ను పులిగా అభివర్ణించడంపై భట్టి విక్రమార్క స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ పులి బయటకు రాగానే.. ప్రజలను దాని నుంచి రక్షించేందుకు బోనులో పెడుతామని వ్యాఖ్యానించారు. ‘పులి బయటకు వస్తుందని అంటున్నారు. ఆ పులి నుంచి రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను ఎలా కాపాడాలో మాకు బాగా తెలుసు. పులి బయటకు రాగానే దానిని బంధించి బోనులో పెడుతాం’ అనిభట్టివిక్ర మార్క వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భట్టి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

అటు రైతుల రుణమాఫీపై కూడా భట్టి స్పందిస్తూ.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వం గొప్పులు చెప్పుకొంటుదన్న భట్టి విక్రమార్క.. అసలు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాలో జమ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రైతులకు రుణమాఫీ అయినట్లు మెసేజ్ పంపించారు కానీ.. బ్యాంకుకు వెళ్లి చూస్తే కాలేదని అన్నారు. ఇందుకు సంబంధించి కొందరు రైతులకు వచ్చిన మెసేజ్‌లను భట్టి విక్రమార్క మీడియాకు చూపించారు.

అయితే బీఆర్ఎస్ ప్రతి సభలోనే రైతులకు రుణమాఫీ చేశామని గొప్పలు చెబుతోంది. కానీ కొందరు రైతులకు రుణమాఫీ అయినట్లు మెసేజ్ వచ్చినప్పటికీ.. డబ్బులు మాత్రం ఖాతాలో పడలేదు. దీంతో చాలా మంది రైతులు కేసీఆర్ పట్ల గుర్రుగా ఉన్నారు. వారిని శాంతింపజేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో భట్టి విక్రమార్క.. రైతు రుణమాఫీ అంశాన్ని లేవనెత్తి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అలాగే భట్టి ఇచ్చిన కౌంటర్‌పై కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 14 =