బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ ‌కు కరోనా పాజిటివ్

bollywood breaking news, bollywood news, Bollywood Star Hero Ranbir Kapoor, Bollywood Star Hero Ranbir Kapoor Tests Positive, Bollywood Star Hero Ranbir Kapoor Tests Positive for Covid-19, Coronavirus, coronavirus india, COVID-19, COVID-19 pandemic in India, Hero Ranbir Kapoor, Hero Ranbir Kapoor Tests Positive for Covid-19, India Coronavirus, Ranbir Kapoor, Ranbir Kapoor Tests Positive for Covid-19

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ ‌కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ర‌ణ్‌బీర్ క‌పూర్ తల్లి నీతూ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ద్వారా వెల్లడించారు. “ర‌ణ్‌బీర్ క‌పూర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు మరియు బాగానే కోలుకుంటున్నాడు. ర‌ణ్‌బీర్ కపూర్ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాడు. మీ ప్రేమకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు” అని నీతూ కపూర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ర‌ణ్‌బీర్ కపూర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పలువురు సినీప్రముఖులు, అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ