భారత్‌-బంగ్లాదేశ్ మధ్య ‘మైత్రి సేతు’ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

Bangladesh, India, Maitri Setu, Maitri Setu between India and Bangladesh, Maitri Setu Bridge, Maitri Setu Bridge between India and Bangladesh, Maitri Setu inauguration live updates, Maitri Setu inauguration live updates India Bangladesh, Mango News, Modi launch Maitri Setu a key link with Bangladesh, PM Modi, PM Modi inaugurate key road link, PM Modi Inaugurates Maitri Setu Bridge, PM Modi Launch Maitri Setu Road Link, Road Link Between Bangladesh And India, Road Link Between Bangladesh And India With Other Key Projects

భారత్, బంగ్లాదేశ్ మధ్య ‘మైత్రి సేతు’ బ్రిడ్జిను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. త్రిపుర మరియు బంగ్లాదేశ్ సరిహద్దు మధ్య ప్రవహించే ఫెని నదిపై 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మించారు భారత్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక, స్నేహపూర్వక సంబంధాలకు ప్రతీకగా ఈ బ్రిడ్జికి ‘మైత్రి సేతు’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ బ్రిడ్జి కనెక్టివిటీ భారత్, బంగ్లాదేశ్ మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడమే గాకా, వ్యాపారానికి కూడా బలమైన అనుసంధానమని రుజువు చేస్తోందని అన్నారు. ఈ ప్రాంతమంతా ఈశాన్య భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య కారిడార్‌గా అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. ఇది దక్షిణ అస్సాం, మిజోరాం, మణిపూర్, త్రిపురలతో పాటు బంగ్లాదేశ్ మరియు సౌత్-ఈస్ట్ ఆసియా కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని చెప్పారు.

ఈ బ్రిడ్జి బంగ్లాదేశ్‌ లో కూడా ఆర్థిక కార్యకలాపాలకు ఉత్సాహాన్ని ఇస్తుందని, ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో సహకరించినందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ ప్రధానికి షేక్ హసీనాకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా వీడియో ద్వారా సందేశం అందించారు. మరోవైపు త్రిపురలో పలు బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రంలో త్రిపుర గవర్నర్ రమేష్ బయోస్, త్రిపుర ముఖ్యమంత్రి బిపీలాబ్ కుమార్ దేబ్ హాజరయ్యారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + one =