బ్లాక్‌ మనీ ప్రవాహానికి ఇకపై అడ్డుకట్ట

Center Focus on Real Estate,Center Focus,Focus on Real Estate,Black Money ,Real Estate ,Center on real estate, black money flow,Mango News,Mango News Telugu,Real Estate Latest News,Tips and Best Practices for Real Estate,2024 commercial real estate,Emerging Trends in Real Estate,Real Estate Latest Updates,Real Estate Live News,Real Estate Live Updates
Black Money ,Real Estate ,Center focus on real estate, black money flow

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ముందు నుంచి కూడా నల్లధనం కట్టడిపై కఠిన వైఖరి అనుసరిస్తూనే ఉంది.  పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ వారికి చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే  బ్లాక్ మనీ ప్రవాహంతో పన్ను ఎగవేతకు రియల్ ఎస్టేట్ రంగం మెయిన్ కేంద్రంగా ఉంటుందన్న లెక్కలతో తాజాగా మోడీ సర్కార్ రియల్ ఎస్టేట్ రంగంపై ఉక్కు పాదం మోపేందుకు సిద్ధమవుతోంది.

రియల్ ఎస్టేట్ రంగంలో లెక్కల్లో చూపించని నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకోవడానికి  కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. దీని కోసం వివిధ కీలక చట్టాలకు ఇప్పటికే సవరణలు కూడా చేసినట్లు పార్లమెంటులో లేవనెత్తిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చారు.అంతేకాదు అవసరం అయితే.. దానికి అనుగణంగా మరింత దూకుడును ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

నల్ల ధనాన్ని అడ్డుకట్ట  వేయలేని ఇలాంటి  లావాదేవీల్లో మనీ ట్రాన్జాక్షన్స్‌ను  నివారించడానికి..కేవలం బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా మాత్రమే పేమెంట్స్ చేయడానికి వీలుగా నిబంధనల్లో మార్పులు చేసినట్లు పంకజ్ చౌదరి చెప్పారు. రూ. 20 వేల కంటే ఎక్కువ విలువైన రిసీప్టులను  నిషేధించడానికి వీలుగా సెక్షన్ 269SS ను సవరించినట్లు స్పష్టం చేశారు. పారదర్శకతను పెంచడానికి సెక్షన్ 269T కింద ఇలాంటి పరిమితిని విధించినట్లు చెప్పారు. పాన్ సమర్పణ, ఎక్కువ విలువ కలిగిన ట్రాన్జాక్షన్స్‌ను నివేదించడం   తప్పనిసరి చేసినట్లు వివరించారు.

దీంతో పాటు బినామీ లావాదేవీలను నిషేధించడం కోసమే  1989లో తీసుకొచ్చిన చట్టానికి తాము  2016లో సవరణలు జరిపినట్లు పంకజ్ చౌదరి గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో పన్ను ఎగవేతకు అవకాశముండే  ట్రాన్సక్షన్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుండటంతో..ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధన ప్రకారం తాము ఇకపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సోదాలు, సర్వేలు నిర్వహించడంతో పాటుగా ఆదాయ అంచనాలు, ట్యాక్స్, జరిమానా విధింపులు, అవసరమైతే విచారణ చేసేలా చర్యలు తీసుకోవడానికి  తాము సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY