ఆ విషయంలో ఎన్టీఆర్‌కు, రేవంత్‌కు పోలికలున్నాయట..

There are similarities between NTR and Revanth in that regard,There are similarities,similarities between NTR and Revanth,NTR and Revanth in that regard,Revanth Reddy,Congress,NTR,NTR and Revanth similarities, Congress,Mango News,Mango News Telugu,Telangana Assembly election,NTR and Revanth similarities News,Telangana Politics,Telangana Latest News,Telangana Latest Updates
Revanth Reddy,Congress,NTR,similarities between NTR and Revanth, Congress

తెలంగాణలో శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించాక.. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి ఎవరుంటే బాగుంటుందనే మాటకు అంతా రేవంత్ రెడ్డి పేరే చెప్పారు. హస్తం పార్టీలో సీనియర్ నేతలు, గతంలో మంత్రులుగా చేసిన వాళ్లు, టీపీసీసీ చీఫ్‌గా పని చేసిన వాళ్లతో పాటు.. అధిష్టానానికి విధేయులుగా చాలామంది ఉన్నా కూడా కేవలం రేవంత్ రెడ్డి పేరు మాత్రమే తెరపైకి వచ్చింది. చాలా కొద్ది మంది మాత్రం సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఒకరిద్దరి పేర్లు చెప్పారు.   హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికే పదవి ఇవ్వడానికి మొగ్గు చూపింది. రెండు రోజుల ఉత్కంఠ తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించడంతో.. నేడు అంటే డిసెంబర్ 7న ప్రమాణస్వీకారానికి ముహుర్తం అయింది.

ఇదే సమయంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ను గుర్తుకు తెస్తూ పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. ఎటువంటి పరిపాలన అర్హత ముందు లేకపోయినా సీఎం కుర్చీలో కూర్చునే అవకాశాన్ని దక్కించుకున్నారంటూ.. రేవంత్‌ను పొగడ్తల ముంచెత్తుతున్నారు.  నిజానికి రేవంత్‌కు రాజకీయంగా గుర్తింపునిచ్చింది టీడీపీనే. తెలుగుదేశం పార్టీలో ఉంటున్న రేవంత్ రెడ్డి..  అనూహ్య పరిణామల మధ్య రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపీని విడిచి కాంగ్రెస్ గూటికి వెళ్లిపోయారు.

రేవంత్ రెడ్డి చేరికను హస్తం పార్టీ నేతలు మొదట్లో వ్యతిరేకించారు. కొడంగల్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో తన సత్తా చాటి మరీ కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోటీని దృష్టిలో పెట్టుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం రేయింబవళ్లు కష్టపడ్డ మనిషిగా గుర్తింపు పొందారు. పార్టీని ముందుకు నడిపించడంలో చూపించిన శ్రద్ద, ఆయన పట్టుదల చూసి ఇది ఎన్టీఆర్‌లోనూ చూసామని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చిన దగ్గర నుంచి రేవంత్ పరిపాలనా అర్హతల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ  పని చేయలేదు. పరిపాలన అనుభవం లేదు.  మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారో ఏంటో అంటూ చాలా ప్రశ్నలు వినిపించాయి. కొందరయితే సూటిగా రేవంత్ రెడ్డినే ప్రశ్నించారు కూడా. దీనికి రేవంత్ రెడ్డి చరిత్రను గుర్తు చేస్తూ మరీ సమాధానాలు ఇచ్చారు. గతంలో ఇందిరా గాంధీ ఎలాంటి పరిపాలనా అనుభవం లేకుండానే భారత దేశానికి ప్రధాన మంత్రిగా.. దేశ ఆర్ధిక వ్యవస్థ స్థితి గతిని మార్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే ఎలాంటి పాలనా అనుభవం లేకుండానే టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్  ముఖ్యమంత్రిగా సుభిక్ష పాలన అందించారని  రేవంత్ తెలియజేశారు.

దీంతో రేవంత్‌ రెడ్డిని చూస్తుంటే నాటి ఎన్టీఆర్ గుర్తుకువస్తున్నారంటూ కొంతమంది తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయంగా టీడీపిని మలచడంతో నందమూరి తారక రామారావు విజయాన్ని సాధించారు .  రాజకీయాలు కొత్తే అయినా, ఎత్తులకు పై ఎత్తు వేస్తూ  చివరకు ప్రజల్లో సుస్ధిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఏపీ అసెంబ్లీ 6వ విడత ఎన్నికల్లో 204 సీట్లు సాధించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు రాజకీయ పరంగా  రేవంత్ రెడ్డి కూడా మరో ఎన్టీఆర్ గా తనను తాను ఆవిష్కరించుకున్నారని అతని అనుచరులు, ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. తెలంగాణలో ఉద్యమ పార్టీగా రెండు సార్లు కూడా భారీ ఆధిక్యంతో  అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీని.. ఇప్పుడు కాంగ్రెస్ ఓడించడంలో రేవంత్ పాత్రే ఉందని చెబుతున్నారు.  అంతర్గత కుమ్ములాటలు ఉన్నా ఒంటరి పోరాటంతో తెలంగాణలో తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =