ఇండియాలో ఇది ఫస్ట్ టైమ్..ఎక్కడో తెలుసా?

A bar and restaurant in the mall,A bar and restaurant,restaurant in the mall,Jio World Plaza Mall,Mukesh Ambani, JWP,A bar and restaurant in the mall, India,Mumbai,Jio World Plaza opens in Mumbai,Mango News,Mango News Telugu,Jio World Plaza MallLive News,Bar in the mall,bar and restaurant,Jio World Plaza Mall Latest News,Jio World Plaza Mall Latest Updates
Jio World Plaza Mall,Mukesh Ambani, JWP,A bar and restaurant in the mall, India,Mumbai

ఒకప్పుడు ఏ బిజినెస్  చేసినా సక్సెస్  రేట్ ఎక్కువగానే ఉండేది. కానీ రానురాను పోటీ పెరిగిపోడం వల్ల కస్టమర్లను ఆకట్టుకోవడంలో ముందున్నవాళ్లే బిజినెస్ లో సక్సెస్‌ను కూడా  చూస్తున్నారు.  దీంతో కస్టమర్లు అభిరుచులు, ఇష్టాలను తెలుసుకుని మరీ బిజినెస్ వరల్డ్‌లో పోటీ పడుతున్నారు వ్యాపారవేత్తలు. దీనిలో చిన్న వ్యాపారులా? లేక పెద్ద వ్యాపారవేత్తలా అని తేడా లేదు.. అంతా కస్టమర్ల నాడిని పట్టుకుని పరుగులు తీయడమే పనిగా పెట్టుకున్నారు. అందుకే ఇలాంటివాళ్లే ఇప్పుడు వ్యాపారంలో నిలదొక్కుకుంటున్నారు. అలాంటి కోవలోకి వచ్చేవారిలో ముఖేష్ అంబానీ ముందుంటారన్న విషయం అందరికీ తెలుసు. తాజాగా మరో కొత్త ఎక్స్పరిమెంట్‌తో మరోసారి ముందుకు వచ్చారు.

ఇప్పుడు చిన్న పార్టీ అయినా.. పెద్ద ఫంక్షన్  అయినా మందు లేకుండా పూర్తవదు అన్న టాక్ వచ్చేసింది. దీంతో పాటు ఒకప్పుడు మద్యం తాగితే తప్పు అనుకున్నవాళ్లు ఇప్పుడు దానినో స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. దీంతో ఆడ, మగ తేడా లేకుండా చాలామంది ఆల్కహాల్ తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే వీధికో గుడి కనిపిస్తుంది అన్న మాట నుంచి వీధిలో బార్, పబ్ కనిపిస్తున్నాయన్న మాటకు కల్చర్ మారిపోయింది. రోడ్డు పక్కనో, వీధి మధ్యలోనో బార్ కంటే ఏకంగా థియేటర్లోనే బార్ ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ముఖేష్ ఇప్పుడు ముందుకొచ్చారు.

ఎందుకంటే ఇప్పటి వరకూ థియేటర్స్‌కు వెళ్లడం  అంటే కేవలం సినిమాలు చూడటానికి మాత్రమే వెళ్లేవారు. కానీ ఇక నుంచి  థియేటర్స్ లో  లగ్జరీ సీట్స్ తో పాటు సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ జోష్‌తోనే  జియో ముంబై  థియేటర్ లో బార్ అండ్ లాంజ్ ని ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఇలాంటి థియేటర్ ఇదే మొదటిది. ఇక్కడ అన్నిరకాల ఆల్కహాల్ బ్రాండ్స్ దొరుకుతాయి.

తాజాగా ముంబయిలో  ప్రముఖ వ్యాపారవేత్త, అపర కుబేరుడు అయిన  ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. అతిపెద్ద లగ్జరీ మాల్ జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభించింది. దీనిలోనే ఈ  థియేటర్స్ కూడా ఉండటంతో యూత్ క్రేజ్ ప్లేస్ అంటూ క్యూ కడుతున్నారు.  అంతేకాకుండా ముంబై నడిబొడ్డున BKCలో జియో వరల్డ్ ప్లాజా.. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్‌కు దగ్గరగా  ఉండటంతో సందర్శకులను ఆకట్టుకుంటోంది

ముంబైలో అతిపెద్ద షాపింగ్ మాల్ జియో వరల్డ్ ప్లాజా నవంబర్ 1న ప్రారంభమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ బాండ్రా కుర్లా కాంప్లెక్స్ ఏరియాలో నిర్మించిన జియో వరల్డ్ ప్లాజాలో.. 66 లగ్జరీ బ్రాండ్ కంపెనీలు తమ స్టోర్లను ఏర్పాటు చేశాయి. ముంబైలో ఫీల్ గుడ్  లగ్జరీ షాపింగ్ అనుభవాన్ని అందించడానికే  ఈ ప్లాజాను రిలయన్స్ వారు తీర్చిదిద్దారు. ఇందులో వ్యక్తిగత షాపింగ్ సహాయం, మల్టీప్లెక్స్ థియేటర్, గౌర్మెట్ ఫుడ్ ఎంపోరియం వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడీ మాల్‌లో  బార్ అండ్ రెస్టారెంట్ ముంబైలో ప్రత్యేక ఆకర్షణగా మారిపోయింది.

ఇప్పుడు  ఈ థియేటర్‌లో యానిమల్ సినిమా ప్రదర్శింపబడుతోందట. ముంబయిలోని బాంద్రా కుర్లూ కాంప్లెక్స్‌లో ఈ లగ్జరీ మాల్‌ను రిలయన్స్ స్టార్ట్ చేసింది. దేశంలో టాప్-ఎండ్, గ్లోబల్ స్టాండర్డ్ షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి రిటైల్ జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభించింది. ముంబై మాల్‌లో ఎంటరైన బార్ అండ్ రెస్టారెంట్ కల్చర్ .. మేజర్ సిటీలలోనూ త్వరలోనే ఎంటర్ అయిపోతాయని చాలామంది అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =