దేశంలో 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల (జడ్జిల) బదిలీకి కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ముందుగా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో 15 మంది న్యాయమూర్తులను బదిలీపై కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల వివరాలు:
- పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుంచి జస్టిస్ జస్వంత్ సింగ్ ఒరిస్సా హైకోర్టుకు బదిలీ
- రాజస్థాన్ హైకోర్టు నుంచి జస్టిస్ సబీనా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు బదిలీ
- ఒరిస్సా హైకోర్టు నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ
- ఛత్తీస్ గడ్ హైకోర్టు నుంచి జస్టిస్ మనీంద్రమోహన్ శ్రీవాస్తవ రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ
- పాట్నా హైకోర్టు నుంచి జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ
- బాంబే హైకోర్టు నుంచి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ
- గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ పరేశ్ ఆర్.ఉపాధ్యాయ మద్రాస్ హైకోర్టుకు బదిలీ
- తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ ఎం.ఎస్.ఎస్ రామచంద్రరావు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ
- కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్ అరిందంసింహా ఒరిస్సా హైకోర్టుకు బదిలీ
- కేరళ హైకోర్టు నుంచి జస్టిస్ ఏ.ఎం.బదర్ పాట్నా హైకోర్టుకు బదిలీ
- అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
- అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ వివేక్ అగర్వాల్ మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ
- అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ చంద్రధారి సింగ్ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
- హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నుంచి జస్టిస్ అనూప్ చిట్కర పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ
- అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ రవినాథ్ తిలహరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ