టార్గెట్ 2026గా ఇస్రో కొత్త ప్రాజెక్ట్.. రెండు దశల్లో చంద్రయాన్‌-4 మిషన్‌

Chandrayaan 4 Mission In Two Phases, Chandrayaan 4 Mission, Chandrayaan 4, Chandrayaan In Two Phases, Chandrayan, Newest Project Of ISRO, Target 2026, Big Boost To ISRO, Chandrayaan-4 To Be Launched In 2 Phases, Cabinet Approves Funds For Four Space Missions, Cabinet Approves New Moon Mission, National News, India, Congress, BJP, PM Modi, Live Updates, Breaking News, Live News, Mango News, Mango News Telugu

చంద్రయాన్‌-4 మిషన్‌, వీనస్‌ ఆర్బిటర్‌ మిషన్‌, గగన్‌యాన్‌, ఎన్‌జీఎల్‌ఏ వాహకనౌక ప్రాజెక్టులకు తాజాగా కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ నాలుగు అంశాపై ఇస్రో పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో కేంద్ర కేబినెట్‌ చంద్రయాన్‌-4 మిషన్‌కు ఆమోదం తెలిపిందని ఇస్రో అధికారులు చెప్పారు.

ఈ ప్రాజెక్టుల సాయంతో చంద్రుడి నుంచి రాళ్లు, మట్టిని భూమిపైకి తీసుకురానున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాజెక్టు 2026 నాటికి చేపట్టాలని ఇస్రో భావిస్తుంది. అయితే చంద్రయాన్ -4ను..ఒకదశలో కాకుండా రెండు దశల్లో చంద్రయాన్‌-4 మిషన్‌ను నిర్వహిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

చంద్రయాన్ -4 ప్రాజెక్టు కోసం ల్యాండర్‌ను ఇస్రో నిర్మిస్తుండగా.. రోవర్‌ను మాత్రం జపాన్‌లో సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మిషన్‌లో భాగంగా చంద్రుడిపై గల మట్టి నమూనాలను సేకరించి.. చంద్రయాన్ -4 తిరిగి భూమిపైకి చేరుకుంటుందని వివరించారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ కనుక అనుకున్నట్లు విజయవంతమైతే అంతరిక్షంలోనే స్పేస్ షటిల్‌ను రూపొందించిన దేశంగా భారత్‌ చరిత్రను లిఖించనుందని ఇస్రో భావిస్తోంది.