బ్యాంకులకు రేపటి నుండి వరుసగా నాలుగు రోజులు పాటు సెలవులు

Bank branches closed for next 4 days, Bank branches may be shut for the next 4 days, Bank Holiday Alert, Bank Strike, Bank strike news, Bank strike on March 15, Banks to be Closed For 4 Days Straight, Banks to stay closed for four days, Banks to stay closed for four days from March 13, Mango News, Public Sector Banks May be Shut for Next 4 Four Days, Public Sector Banks May be Shut for Next 4 Four Days due to Holidays and Strike

దేశంలో మార్చి 13 నుంచి మార్చి 16 దాకా నాలుగు రోజుల పాటుగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నాలుగు రోజుల్లో మార్చి 13 రెండో శనివారం, మార్చి 14 ఆదివారం నాడు సెలవులు కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఇక మార్చి 15, 16 తేదీల్లో పలు యూనియన్లతో కూడిన ది యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) సమ్మెకు పిలుపు నిచ్చింది. దీంతో వరుసగా మొత్తం నాలుగురోజులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. అయితే ప్రైవేటు బ్యాంకులు, ఏటీఎం సేవలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు మాత్రం ఎప్పటిలాగానే కొనసాగనున్నాయి.

ఇటీవల కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రవేశపెట్టిన సమయంలో మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) ప్రైవేటీకరణ చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ చర్యకు నిరసనగా యూఎఫ్‌బీయూ నేతృత్వంలో పలు యూనియన్స్ రెండు రోజుల పాటుగా సమ్మెకు పిలుపునిచ్చాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + three =