పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం, 6 నగరాల నుంచి వచ్చే విమానాలపై బ్యాన్

Howrah, kolkata, Kolkata Bans Flight, Kolkata Bans Flight Services, Kolkata Bans Flight Services From 6 Cities, North 24 Parganas, Union Civil Aviation Ministry, West Bengal, West Bengal CM Mamata Banerjee, West Bengal Government

రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నగరాల నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చే విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌కు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న ఢిల్లీ, ముంబై, పుణే, నాగ్‌పూర్‌, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాల నుంచి కోల్‌కతాకు వచ్చే విమానాల సర్వీసులు రద్దు చేస్తునట్టు ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ప్రకటించారు. ముందుగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా ప్రభావం ఎక్కువుగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే విమాన సర్వీసులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకునట్టుగా తెలుస్తుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్ లో జూలై 4, శనివారం నాటికీ 20488 కరోనా కేసులు నమోదవగా, 717 మంది మరణించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu