ట్విట్టర్ కీలక నిర్ణయం.. ఇండియాలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు బ్లూ టిక్‌ తొలగింపు, ఎందుకంటే?

Twitter Begins Removing Blue Checks From Many Users Accounts Who Don't Pay Monthly Fee,Twitter Begins Removing Blue Checks,Removing Blue Checks From Many Users Accounts,Twitter Accounts Who Don't Pay Monthly Fee,Twitter Users Accounts,Mango News,Mango News Telugu,Twitter To Remove Legacy Blue Ticks Starting Today,Not A Twitter Blue Subscriber,Twitter To Remove Blue Ticks From Today,Elon Musk Deadline To Remove Legacy Blue Ticks Today,Twitter Blue Subscription,Twitter Blue Tick Copy,Twitter Blue Benefits,Internet Reacts To Twitter'S Decision,Twitter Verification Requirements,All Legacy Blue Check Marks To Go Away

ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధిపతి ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ రుసుము చెల్లించని వినియోగదారుల ఖాతాల నుండి బ్లూ టిక్‌లను తీసివేయడం ప్రారంభించింది. నిజమైన సెలబ్రిటీల ఖాతాలను గుర్తించేందుకు వీలుగా ట్విట్టర్ ఈ బ్లూ టిక్​ను, నెలవారీ సబ్​స్క్రిప్షన్ తీసుకున్నవారికే కేటాయిస్తోంది. అయితే సాధారణ యూజర్లు సైతం బ్లూ టిక్ పొందేలా సబ్​స్క్రిప్షన్ ప్లాన్లు రూపొందించింది. ఈ క్రమంలో డబ్బులు చెల్లించనివారికి తాజాగా టిక్ మార్క్​ను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. కాగా ట్విట్టర్ ఒరిజినల్ బ్లూ-చెక్ సిస్టమ్ కింద దాదాపు 3,00,000 ధృవీకరించబడిన వినియోగదారులను కలిగి ఉంది. వీరిలో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. ట్విట్టర్ తాజా చర్యతో ఈ ప్రముఖుల ప్రొఫైల్‌ల నుండి బ్లూ చెక్‌లు కనిపించకుండా పోయాయి.

ఈ క్రమంలో ఇండియాలోని చాలామంది ప్రముఖుల ఖాతాలలో ఈ బ్లూ టిక్‌ మార్క్‌ కనిపించడం లేదు. వీరిలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, క్రికెటర్లు ఎంఎస్‌ ధోని, విరాట్ కోహ్లీ, నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్‌ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, విజయ్‌, శింబు వంటి స్టార్‌ సెలబ్రిటీలు ఉన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో సైతం అనేకమంది ప్రముఖులకు ఈ అనుభవం ఎదురైంది. సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, వెంకటేశ్‌, మోహన్‌ బాబు, అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని, మంచు మనోజ్, నితిన్, ప్రకాశ్ రాజ్, పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి తదితర ప్రముఖులు తమ బ్లూ టిక్‌ను కోల్పోయారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణుల ఖాతాలకు మాత్రం బ్లూ టిక్‌లు కనిపిస్తున్నాయి. దీంతో వీరంతా ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఉంటారని భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − three =