భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూన్ 3, బుధవారం నాటికే మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74,860 కి చేరింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా బుధవారంనాడు 122 మంది కరోనా వలన కన్నుమూశారు. దీంతో ఆ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 2,587కి చేరింది. మొత్తం కేసుల్లో 32329 మంది కోలుకోగా, ప్రస్తుతం 39944 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
ఒక్క ముంబయి నగరంలోనే 43,492 కరోనా కేసులు నమోదవగా, 1417 మంది మరణించారు. ఇప్పటిదాకా థానే లో 10865, పుణేలో 8463, ఔరంగాబాద్ లో 1653, రాయఘడ్ లో 1238, నాసిక్ లో 1235, పాల్గర్ లో 1199, సోలాపూర్ లో 1032 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ అమలుతో పాటు కీలక చర్యల దిశగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే మొత్తం 4,97,276 మందికి కరోనా పరీక్షలు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu