ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. ముఖ్యంగా యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోప్ దేశాల్లో రెండో వేవ్ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫ్రాన్స్ లో మరోసారి లాక్‌డౌన్ విధించగా, యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా రెండోసారి లాక్‌డౌన్ పై కీలక ప్రకటన చేశారు. రెండో దశ కరోనా మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్ మినహా ప్రత్యామ్నాయం లేనందువలన చర్య తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. వచ్చే గురువారం నుండి నాలుగు వారాల పాటుగా యూకేలో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు.
కొత్త లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం, ఆఫీస్, చికిత్స, విద్య, స్వల్ప వ్యాయామం, అత్యవసర/నిత్యవసర వస్తువుల కొనుగోలు వంటి వాటికీ మాత్రమే మినహాయింపులు వర్తిస్తాయని, ఇవి మినహా మిగతా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని చెప్పారు. పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలు తెరిచి ఉండటానికి అనుమతి ఉంటుందని, అనవసరమైన దుకాణాలు, రెస్టారెంట్లు, పబ్బులు మరియు ఇతర ఆతిథ్య రంగాలు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేయబడతాయని పేర్కొన్నారు. ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా ఆచరిస్తే క్రిస్‌మస్ అప్పటికి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని అన్నారు. అలాగే లాక్‌డౌన్ ఆంక్షలను డిసెంబర్ 2 తో ముగించాలని యోచిస్తునట్టుగా తెలిపారు. మరోవైపు యూకేలో ఇప్పటికి కరోనా పాజిటివ్ కేసులు 1,034,914 కు చేరుకోగా, 46 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ