దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు మరియు హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు అందించిన మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ, ప్రత్యక్ష రాష్ట్ర సేకరణ కేటగిరి ద్వారా ఇప్పటికి దాదాపు 153 కోట్ల (1,52,96,00,055) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు. అలాగే అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జనవరి 4, మంగళవారం నాటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 19.69 కోట్లకుపైగా (19,69,01,436) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ