భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 24, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,287,945 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 49,310 కరోనా పాజిటివ్ కేసులు, 740 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒకేరోజులో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 30,601 కి చేరింది. దేశంలో మరణాల రేటు 2.38 శాతంగా ఉండగా, ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ 7 వ స్థానానికి చేరింది. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది
మరోవైపు కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని 817,209 మంది డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 440,135 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నపటికి కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 63.45 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu