దేశంలో 55 లక్షలు దాటిన కరోనా కేసులు: 24 గంటల్లో 75083 కేసులు, 1053 మరణాలు

Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, India Corona Updates, India Coronavirus, India Covid-19 Updates, total corona cases in india today, Total Corona Positive Cases in India, total corona positive in india

భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 75,083 పాజిటివ్ కేసులు నమోదవగా, 1053 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 22, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 55,62,663 కు, మరణాల సంఖ్య 88,935 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మరణాల రేటు 1.6 శాతం ఉండగా, ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.

మరోవైపు గత 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో 1,01,468 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 44,97,867 కు చేరుకుంది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో, రికవరీ రేటు 80.9 శాతంగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రికవరీల పరంగా అమెరికాను అధిగమించి భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 9,75,861 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu