గత 24 గంటల్లో కొత్తగా 9110 కరోనా కేసులు, 78 మరణాలు నమోదు

Covid-19 in India: Recovery Rate 97.25 and Death Rate Stands at 1.43 Percent

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 9,110 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,47,304 కు చేరుకుంది. కరోనాతో మరో 78 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,55,158 కి పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసులు 1.43 లక్షలకు (1,43,625) తగ్గాయి. మొత్తం పాజిటివ్ కేసులలో కేవలం 1.32% మాత్రమే యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

కరోనా రికవరీ రేటు 97.25 శాతం, మరణాల రేటు 1.43 శాతం:

ఇక కొత్తగా 14,016 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,05,48,521 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.25 శాతం గానూ, మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, కర్ణాటక, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 14,016 కేసులలో 81.39% శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ