దేశంలో 6 కోట్లు దాటిన కరోనా పరీక్షలు, గత 24 గంటల్లో 11 లక్షలకు పైగా పరీక్షలు

Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Covid-19 Testing InIndia, Covid-19 Testing Status, Covid-19 Testing Status India, India Coronavirus, India Covid-19 Testing Status, India Covid-19 Updates, India has Tested More Than 6 Crore Samples

దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో ఇటీవల పరీక్షల సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల్లో భారత్ మరో కీలక మైలురాయి దాటింది. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 6 కోట్లు దాటింది. సెప్టెంబర్ 17 నాటికీ మొత్తం 6,05,65,728 మంది శాంపిల్స్ పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే 11,36,613 కరోనా పరీక్షలను నిర్వహించారు.

దేశంలో కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ లేబరేటరీల (రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్, ట్రూ-నాట్, సి.బి-నాట్ ) సంఖ్య తాజాగా 1059 కి చేరుకోగా, ప్రైవేట్ లాబొరేటరీస్ సంఖ్య 692 కి పెరిగింది. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించే మొత్తం లాబ్స్ సంఖ్య 1751 కు చేరుకుంది. మరోవైపు దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలలోనే దాదాపుగా 60 శాతం యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu