దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 2,81,109 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 94.91 శాతం

Coronavirus, Coronavirus Cases, coronavirus cases in india state wise, coronavirus cases in india today state wise, coronavirus cases india, COVID-19, COVID-19 Cases in India, covid-19 new variant, India Omicron Cases, India Reports 6563 Covid-19 Cases in Last 24 Hours, Mango News, Mango News Telugu, New coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, Omicron, , Omicron Cases In India, Omicron covid variant, Omicron variant, Update on Omicron

దేశంలో గత కొన్ని రోజులతో పోలిస్తే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 1,61,386 పాజిటివ్ కేసులు, 1733 మరణాలు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో మునుపటి మరణాలకు సంబంధించి సవరణ నేపథ్యంలో ఒక్కరోజే 1205 మరణాలను ప్రకటించడంతో రోజువారీ మరణాల సంఖ్య అధికంగా ఉంది. దీంతో ఫిబ్రవరి 2, బుధవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,16,30,885 కు, మరణాల సంఖ్య 4,97,975 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 9.26 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 14.15 శాతంగా ఉంది.

అలాగే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల వ్యవధిలో 2,81,109 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,95,11,307 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 94.91 శాతం గానూ, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 16,21,603 (3.90%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువుగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో నిలిచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ