వాట్సాప్‌ లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే…

COVID Vaccination Certificate, Covid vaccination certificate now available through WhatsApp, Covid-19 Vaccination, COVID-19 Vaccination Certificate, COVID-19 vaccination certificate download, COVID-19 Vaccination Certificate Now Available Through WhatsApp, COVID-19 Vaccination News, COVID-19 Vaccination Updates, How to Get COVID-19 Vaccination Certificate, manog news, Vaccination Certificate Now Available Through WhatsApp

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకున్న వారు తమ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు కేంద్రం మరో విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్తగా సెకన్ల సమయంలోనే వాట్సాప్ ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. వాట్సాప్ లో 3 సులభమైన స్టెప్స్ తో MyGov కరోనా హెల్ప్‌డెస్క్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికేట్ పొందొచ్చని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం నాడు ట్వీట్ చేశారు.

వాట్సాప్ ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం:

  • ముందుగా MyGov కరోనా హెల్ప్‌డెస్క్ కాంటాక్ట్ నంబర్‌ +91 9013151515 మొబైల్ లో సేవ్ చేసుకోవాలి.
  • ఈ నెంబర్ కు వాట్సాప్ లో ”covid certificate” అని టైప్ చేసి మెసేజ్ పంపించాలి.
  • అనంతరం మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.
  • వెంటనే చాట్ బాక్స్ లో వచ్చిన వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • అయితే ఈ పక్రియ కోసం కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకున్న సమయంలో కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న ఫోన్‌ నెంబర్‌ ఉన్న మొబైల్ ఫోన్ నే ఉపయోగించాలి.
  • అలాగే ఒకే నెంబర్ ద్వారా ఒక్కరి కంటే ఎక్కువ మంది రిజిస్టర్‌ చేసుకొని ఉంటే, వారందరి పేర్ల జాబితాను వాట్సాప్‌ లో చూపిస్తుంది. ఎంతమందివి కావాలో ఆ సంఖ్యను ఎంటర్‌ చేసి వారి యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ పొందవచ్చు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ