హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు కింద దళిత బంధు, రూ.500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

500 Crore Dalit Bandhu Funds for Huzurabad Constituency, Dalit Bandhu, Dalit Bandhu Funds, Dalit Bandhu Funds for Huzurabad, Dalit Bandhu Pilot Project, Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme In Telangana, Huzurabad constituency, Mango News, telangana, Telangana Dalit Bandhu scheme, Telangana Govt, Telangana Govt Released Rs 500 Crore Dalit Bandhu Funds, Telangana Govt Released Rs 500 Crore Dalit Bandhu Funds for Huzurabad Constituency

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆగస్టు 16 నుండి ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో సంతృప్తికర స్థాయిలో దళిత బంధు పథకం అమలుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప‌థ‌కం అమ‌లు కోసం రూ. 500 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

రూ.500 కోట్లను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. టీఎస్ సీసీడీసీ లిమిటెడ్ (హైదరాబాద్) వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ, కరీంనగర్ కలెక్టర్ ఇందుకు సంబంధించిన అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఆగస్టు 6న వాసాలమర్రి గ్రామానికి కూడా దళిత బంధు పథకం అమల్లో భాగంగా రూ.7.60 కోట్ల నిధులును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద దళితుల అభివృద్ధి కొరకు కుటుంబానికి పదిలక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 6 =