దేశంలో సోమవారం ఉదయానికి 37,58,843 లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్

Covid-19 Vaccination: So far 37.5 Lakh Beneficiaries Vaccinated in India

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 253 సెషన్స్ నిర్వహించగా 14,509 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో ఫిబ్రవరి 1, సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 37.5 లక్షలకు పైగా (37,58,843) మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 1,87,252 మంది, తెలంగాణలో 1,68,606 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేశారు. దేశంలో జనవరి 16 న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవగా, తక్కువ సమయంలోనే 37 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసి ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే ఎంతో ముందున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ