తెలంగాణలో 3 ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచిత చికిత్స

3 Private Medical Colleges Chosen in Telangana, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Corona, Telangana Coronavirus, Telangana Coronavirus News, Telangana to Treat Corona Patients at Free of Cost

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కరోనాకు ఉచిత చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటగా మూడు ప్రైవేట్‌ మెడిక‌ల్ కాలేజీల‌కు సంబంధించిన ఆసుపత్రులను కరోనా ఉచిత చికిత్సకు ఎంపిక చేశారు. మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో ఇకపై కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ జాబితాలోకి త్వరలో మరో 7 ఆసుపత్రులను చేర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిథిలో 98 ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా చికిత్స చేసేందుకు అనుమతులు ఇచ్చినట్టు తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ తెలిపారు. అందులో 54 ఆసుపత్రుల్లో ఇప్పటికే కరోనాకు చికిత్స అందజేస్తున్నట్టు తెలుస్తుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =