తెలంగాణలో పాఠ‌శాల‌లు ప్రారంభం, కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు

Mango News, Schools Started for 9 and 10 Class Students, telangana, Telangana Education Department, Telangana Education News, Telangana Schools, Telangana Schools Reopen News, Telangana Schools Reopening, Telangana Schools Reopening News, Telangana Schools Reopening Updates, Telangana Schools Started, Telangana Schools Started for 9 and 10 Class, Telangana Schools Started for 9 and 10 Class Students

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి (ఫిబ్రవరి 1, సోమవారం) 9, 10 వ తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కరోనాతో ఏర్పడ్డ పరిస్థితుల అనంతరం ప‌ది నెల‌ల త‌ర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠ‌శాల‌‌లు ప్రారంభ‌మ‌య్యాయి. పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా అన్ని క‌రోనా నిబంధనలు పాటిస్తున్నారు. ఎంట్రన్స్ వ‌ద్దే విద్యార్థులకు థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలలను పూర్తిగా శానిటైజ్ చేసి, విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా టాయిలెట్స్, పాఠశాల ప్రాంగణం అంతా పరిశుభ్రం చేసి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూడా కోవిడ్ నిబంధనలును ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.

అలాగే పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుండి రాతపూర్వక అనుమతి పత్రం తీసుకురావడం తప్పనిసరి చేశారు. ఇక 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ పద్ధతిలోనే తరగతులు జరుతున్నాయి. మరోవైపు పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడాలోని చల్ల లింగారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + eighteen =