కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కీలక ప్రకటన, జనవరి 13 లోపే ప్రారంభించే అవకాశం?

coronavirus vaccine, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution in India, Covid-19 Vaccine Distribution latest News, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, India Covid-19 Vaccine Distribution, Mango News Telugu

దేశంలో అత్యవసర వినియోగానికి సంబంధించి కోవిషిల్డ్, కొవాగ్జిన్‌ కరోనా వ్యాక్సిన్ లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) జనవరి 3 న షరతులతో కూడిన ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సిన్స్ అత్యవసర వినియోగానికి అధికారికంగా ఆమోదం పొందిన నాటి నుండి 10 రోజులలోపే వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. దీంతో జనవరి 13 వ తేది లోపే దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మరోవైపు దేశంలో వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రత్యేక వాక్సిన్ స్టోర్ లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జీఎంఎస్‌డీగా పిలువబడే క‌ర్నాల్‌, ముంబయి, చెన్నై, కోల్‌క‌తాల‌లో 4 ప్రైమరీ వ్యాక్సిన్ స్టోర్స్ ఉన్నాయని చెప్పారు. అలాగే వీటితో పాటుగా దేశవ్యాప్తంగా 37 వ్యాక్సిన్ స్టోర్స్ ఉన్నాయని, ఈ స్టోర్స్ లో వ్యాక్సిన్లను పెద్దమొత్తంలో నిల్వ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. స్టోర్స్ లో నిల్వ చేసిన వ్యాక్సిన్‌లను, వాటి ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు డిజిటల్ గా పర్యవేక్షిస్తామని, దేశంలో ఒక దశాబ్దం కాలం నుంచే ఈ సౌకర్యం అందుబాటులో ఉందని చెప్పారు. హెల్త్‌ కేర్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్స్ లబ్ధిదారులుగా వారి పేర్లను నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారి డేటా కో-విన్ వ్యాక్సిన్ డెలివరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఇప్పటికే నమోదై ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ