ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత

Legendary lyricist Vennelakanti, Legendary lyricist Vennelakanti passes away, Lyricist Vennelakanti Passes Away, Mango News Telugu, Noted Telugu lyricist Vennelakanti, Popular Lyricist Vennelakanti Passes Away, Telugu Lyricist Vennelakanti, Telugu Lyricist Vennelakanti Passes Away, Telugu Lyricist Vennelakanti Passes Away In Chennai, Tollywood News, Well-known Lyricist Vennelakanti Passes Away

ప్రముఖ సినీ గేయ, సంభాషణ రచయిత వెన్నెలకంటి (63) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం చెన్నైలోని నివాసంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ గేయరచయితగా వెన్నెలకంటి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆయన పూర్తిపేరు వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్‌. ముఖ్యంగా తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతో పాటుగా డబ్బింగ్‌ చిత్రాలకు ఆయన పాటలు మరియు మాటలు కూడా రాశారు. ఆయన 2 వేలకు పైగా పాటలు రాయగా, పలు చిత్రాల్లో రాసిన పాటలు ఎంతో పాపులర్‌ అయ్యాయి. ఆయన కుమారులు శశాంక్‌ వెన్నెలకంటి, రాకేందు మౌళిలు కూడా సినీరంగంలోనే కొనసాగుతున్నారు. వెన్నెలకంటి మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − nineteen =