పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, ఇంగ్లాండ్ లో మళ్ళీ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

Boris Johnson, Boris Johnson announces complete lockdown in UK, complete lockdown, Complete Lockdown In England, Coronavirus, England Coronavirus, England Coronavirus News, England Coronavirus Updates, England Lockdown, England to go under complete lockdown, Mango News Telugu, UK PM, UK PM Boris Johnson, UK PM Boris Johnson Announced Complete Lockdown In England

యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభణ కొనసాగుతుంది. దీంతో యూకే లో రోజువారీగా వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ లో మళ్ళీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తునట్టుగా యూకే‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బుధవారం నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తుందని, కరోనా ఇన్ఫెక్షన్ రేట్ తగ్గేంతవరకు ఫిబ్రవరి మూడో వారం వరకు లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. సోమవారం నాటికి కరోనా వలన దాదాపు 27,000 మంది ఆసుపత్రిలో ఉన్నారని, గత ఏడాది ఏప్రిల్‌లో మొదటి వేవ్ కరోనా గరిష్ట స్థాయి కంటే ఇది 40 శాతం ఎక్కువని చెప్పారు.

ప్రాథమిక, సెకండరీస్థాయి పాఠశాలలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ మూసివేయబడతాయన్నారు. సాధ్యమైన చోట ఇంటి నుండి పని చేయడం, ఉదయం పూట వ్యాయామం, అవసరమైన వస్తువుల కొనుగోలు మరియు వైద్య సహాయం మినహా ఇంటి నుండి బయటకు వచ్చేందుకు అనుమతి లేదని చెప్పారు. 16 మరియు 18 సంవత్సరాల పిల్లలకు వార్షిక జాతీయ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే దానిపై సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఫైజర్ కరోనా వ్యాక్సిన్, ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతుందని, వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేంతవరకు ప్రజలంతా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ విజ్ఞప్తి చేశారు. మరోవైపు స్కాట్లాండ్ లో మంగళవారం అర్ధరాత్రి నుంచే లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 9 =