మళ్ళీ కరోనా తీవ్రత, ఒకేరోజులో 4092 పాజిటివ్ కేసులు, 40 మరణాలు

Covid Cases Increasing Again in Maharashtra, 4092 New Positive Cases, 40 Deaths Reported

దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మాత్రం మళ్ళీ రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఇటీవల కరోనా కేసులు, మరణాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. అయితే గత ఐదు రోజులుగా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. 39 రోజుల తర్వాత ఆదివారం నాడు మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య 4 వేలు దాటింది.

ఫిబ్రవరి 15, ఆదివారం నాడు 4092 కరోనా కేసులు, 40 మరణాలు నమోదుకావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,64,278 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 51,529 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 1,355 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,75,603 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.7 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.5 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 35,965 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఆదివారం నాటికి మహారాష్ట్రలో 1,53,21,608 కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ఇప్పటికి పూణే నగరంలో అత్యధికంగా 3,94,663, ముంబయి నగరంలో 3,14,076 కరోనా కేసులు నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ