ఒమిక్రాన్‌పై డ‌బ్ల్యూహెచ్ఓ యూరప్ రీజియన్ డైరెక్ట‌ర్‌‌ కీల‌క వ్యాఖ్య‌లు

Coronavirus Pandemic, Coronavirus pandemic Endgame, Covid pandemic may well be over in Europe after Omicron, covid-19 new variant, Europe Could Be Headed A Kind Of Pandemic Endgame, Europe Could Be Headed For Covid Pandemic Endgame, Europe could be headed towards end of pandemic, Europe Could Be Headed Towards End of Pandemic After Omicron, Mango News, New coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, Omicron, Omicron covid variant, Omicron variant, omicron variant in India, omicron variant south africa, Update on Omicron, WHO Europe Region Director

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త్వరలోనే క‌రోనా ముగింపు ద‌శ‌కు వ‌స్తుంద‌ని వ్యాఖ్యనించారు. ప్రస్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు జోరుగా పెరుగుతున్నాయి. మన దేశంలో కరోనా వ్యాప్తి శరవేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 14 లక్షల టెస్టులు చేయగా.. కొత్తగా 3,06,064 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 4 కోట్లకు దగ్గరగా, 3.95 కోట్లకు చేరింది. ముఖ్యంగా ఒమిక్రాన్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ రీజియన్ డైరెక్టర్ హన్స్ హెన్రి క్లూగే గుడ్ న్యూస్ చెప్పారు. యూర‌ప్‌ లో క‌రోనా ముగింపు ద‌శ‌కు వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. మార్చి నాటికి ఐరోపాలోని 60 శాతం మందికి ఒమిక్రాన్ సోకే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఒమిక్రాన్‌ వ్యాప్తి అనంత‌రం కొన్ని రోజుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంద‌ని వెల్ల‌డించారు. వ్యాక్సిన్ లేదా స‌హ‌జసిద్ధంగానైనా రోగనిరోధక శక్తి పెర‌గొచ్చ‌ని ఆయ‌న అన్నారు. ఆఫ్రికాలో నాల్గో వేవ్ త‌ర్వాత గ‌రిష్ట స్థాయికి క‌రోనా కేసులు చేరాయి. అయితే, ఇప్పుడు అక్కడ క‌రోనా కేసు‌లు త‌గ్గుతున్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్ఓ పేర్కొంది. భ‌విష్య‌త్‌లో యూరోపియ‌న్ రీజియ‌ర్‌, ఆసియా దేశాల్లోనూ ఇటువంటి అవ‌కాశం ఉంటుద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here