రేషన్ వాహనాల రంగులపై ఎస్‌ఈసీ ఆదేశాలను సస్పెండ్‌ చేసిన హైకోర్టు

AP High Court Suspends SEC Orders over Ration Door Delivery Vehicles,Mango News,Mango News Telugu, AP High Court suspends SEC’s order gives nod for supply of ration through door delivery vehicles,AP High Court Green Signal to Jagananna Door Delivery System,SEC Nimmagadda Ramesh Kumar,Andhra HC suspends SEC order restricting ration vehicles,Andhra HC suspends SEC order restricting ration vehicles,Andhra HC suspends SEC order restricting ration vehicles,Andhra HC suspends SEC order restricting ration vehicles,Andhra HC suspends SEC order restricting ration vehicles

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ కోసం అందుబాటులోకి తెచ్చిన‌ వాహనాల రంగులు మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన ఆదేశాలను సోమవారం నాడు హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఈ సస్పెన్షన్‌ ఉత్తర్వులు మార్చి 15 వ తేదీ వరకు అమలులో ఉంటాయని కోర్టు వెల్లడించింది. అలాగే ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 15 వ తేదీన చేపట్టనున్నట్టు కోర్టు పేర్కొంది.

ముందుగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రేషన్‌ వాహనాల రంగులు మార్చాలని ఫిబ్రవరి 6 న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. వాహనాలపై వైసీపీ రంగులు ఉన్నాయని, రంగులు మార్చేవరకు గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ పంపిణీ నిలిపివేయాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల రంగులు మార్చడం సాధ్యం కాదని, అలాగే అందుకు రెండు నెలల సమయం, భారీగా ఖర్చు అవుతుందని కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల వాదన అనంతరం ఎస్‌ఈసీ ఆదేశాలను హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eleven =