ముంబయిలోని హోటల్ లో ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్య!

Dadra and Nagar Haveli MP Mohan Delkar Found Dead at Hotel in Mumbai

దాద్రా నగర్ హవేలీ లోక్‌సభ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ (58) సోమవారం నాడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ముంబయిలోని మెరైన్ డ్రైవ్ లోని ఒక హోటల్‌ లో మోహన్‌ దేల్కర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎంపీ మోహన్ దేల్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించించారు. అలాగే ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు.

ఎంపీ మోహన్ దేల్కర్ దాద్రా నగర్‌ హవేలీ స్థానం నుంచి మొత్తం ఏడు సార్లు ఎంపీగా గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఎంపీగా గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ట్రేడ్ యూనియన్ లీడర్ గా గిరిజనుల హక్కుల కోసం కూడా మోహన్ దేల్కర్ పోరాటం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ