ఐపీఎల్ పండుగ వచ్చేసింది, మరికాసేపట్లో ఘనంగా ప్రారంభం

2021 Indian Premier League, indian premier league, Indian Premier League 2021, Indian Premier League 2021 matches, Indian Premier League 2021 Season, Indian Premier League 2021 Season Preview, Indian Premier League 2021 Starts From Tomorrow, indian premier league 2021 teams, IPL, IPL 2021, IPL 2021 Live Cricket Scores, ipl 2021 news, ipl 2021 schedule, IPL 2021 score, IPL 2021 Starts, IPL 2021 Updates, Mango News

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2021 మరికొద్ది గంటల్లో ఘనంగా ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ముంబయి ఇండియన్స్‌ మరియు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ తో క్రీడాభిమానులకు అత్యంత ఇష్టమైన ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 30న జరగనుంది.‌ భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచులు రాత్రి 7.30 గంటలకు, ‌మరియు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్నాయి. ఈసారి కూడా ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు జరగనున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితులు దృష్ట్యా మ్యాచుల నిర్వహణ, ఆటగాళ్ల భద్రతా విషయంలో మరిన్ని జాగ్రత్తలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, ఈ సీజన్ విజయవంతంగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండడంతో ఐపీఎల్ పై ఎప్పటిలాగానే భారీ హైప్ నెలకుంది. ఈ ఐపీఎల్ లో ఎలాంటి సంచనాలు నమోదుకాబోతున్నాయో వేచిచూడాలి.

ఐపీఎల్‌-2021 వివరాలు:‌

  • ప్రారంభ తేదీ – ఏప్రిల్ 9
  • ఫైనల్స్ – మే 30
  • మ్యాచుల సమయాలు: మధ్యాహ్నం గం.3.30, రాత్రి గం.7.30
  • వేదికలు: చెన్నై, ముంబయి, అహ్మదాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు

2008 నుంచి 2020 వరకు ఐపీఎల్ విన్నర్స్ జాబితా:

  • ఐపీఎల్ విజేత 2008: రాజస్థాన్ రాయల్స్
  • ఐపీఎల్ విజేత 2009: డెక్కన్ ఛార్జర్స్
  • ఐపీఎల్ విజేత 2010: చెన్నై సూపర్ కింగ్స్
  • ఐపీఎల్ విజేత 2011: చెన్నై సూపర్ కింగ్స్
  • ఐపీఎల్ విజేత 2012: కోల్‌కతా నైట్ రైడర్స్
  • ఐపీఎల్ విజేత 2013: ముంబై ఇండియన్స్
  • ఐపీఎల్ విజేత 2014: కోల్‌కతా నైట్ రైడర్స్
  • ఐపీఎల్ విజేత 2015: ముంబై ఇండియన్స్
  • ఐపీఎల్ విజేత 2016: సన్‌రైజర్స్ హైదరాబాద్
  • ఐపీఎల్ విజేత 2017: ముంబై ఇండియన్స్
  • ఐపీఎల్ విజేత 2018: చెన్నై సూపర్ కింగ్స్
  • ఐపీఎల్ విజేత 2019: ముంబై ఇండియన్స్
  • ఐపీఎల్ విజేత 2020: ముంబై ఇండియన్స్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − five =