ప్రపంచ దేశాలలో ‘మంకీపాక్స్’ కలకలం.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేక మార్గదర్శకాలు జారీ

Central Govt Issues Special Guidelines For The Prevention of Monkeypox Disease in Country, Central Issues Special Guidelines For The Prevention of Monkeypox Disease in Country, Govt Issues Special Guidelines For The Prevention of Monkeypox Disease in Country, Special Guidelines For The Prevention of Monkeypox Disease in Country, Special Guidelines For Monkeypox Disease, Monkeypox Disease Special Guidelines, Monkeypox Disease in Country, Monkeypox Disease, Health Ministry issues Special Guidelines to tackle monkeypox, monkeypox, Monkeypox Disease News, Monkeypox Disease Latest News, Monkeypox Disease Latest Updates, Monkeypox Disease Live Updates, Mango News, Mango News Telugu,

కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది అనుకుంటున్న తరుణంలో ‘మంకీపాక్స్’ రూపంలో మరో వ్యాధి ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు కానప్పటికీ, ఇతర దేశాలలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా మనదేశం కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు దేశంలో మంకీపాక్స్ వ్యాధి నివారణకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

  • వ్యాధి ప్రభావిత దేశాల నుండి వచ్చే ప్రయాణికులు లేదా గత 21 రోజులుగా పాజిటివ్ కేసుతో సంబంధం ఉన్నవారు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
  • అడవి జంతువులకు దూరంగా మసలుకోవాలి, ఇంకా వాటి ఆహారాన్ని తీసుకోవద్దని హెచ్చరించింది.
  • అలాగే ఆఫ్రికా జంతు పదార్ధాలతో తయారైన పౌడర్స్, క్రీమ్స్, లోషన్స్ వంటివి వినియోగించవద్దని సూచించింది.
  • మంకీపాక్స్ యొక్క ఒక్క కేసును కూడా “వ్యాప్తి”గా పరిగణించాలి. దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని జిల్లా నిఘా విభాగాలకు ఆదేశం.
  • ఏ వయస్సు వ్యక్తులలోనైనా తీవ్రమైన శరీరంపైన దద్దుర్లు, వాపు కణుపులు, జ్వరం, తలనొప్పి, వొళ్ళు నొప్పులు, గాఢమైన బలహీనత మొదలైన లక్షణాలు కనిపిస్తే మంకీపాక్స్‌ వైరస్ టెస్ట్ చేయించాలి.
  • మంకీపాక్స్ వైరస్ యొక్క పాలీమరేస్ చైన్ రియాక్షన్ (పిసిఆర్) మరియు సీక్వెన్సింగ్ ద్వారా వైరల్ డిఎన్ఏ యొక్క ప్రత్యేకమైన సీక్వెన్స్‌లను గుర్తించడం కోసం పుణెలో ఒక ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేశారు.
  • దేశంలోని సంబంధిత జిల్లా లేదా రాష్ట్రానికి చెందిన ఏదేని అనుమానిత క్లినికల్ నమూనాలను గుర్తిస్తే తదుపరి సీక్వెన్సింగ్ పరీక్ష కోసం వెంటనే పుణె లోని ‘అపెక్స్ లాబొరేటరీ’కి పంపించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eight =